Wednesday, July 24, 2019

వరుణ్ కర్చీఫ్ వేసేశాడు

చక్కగా వినాయక చవితి వీకెండ్లో సోలోగా బరిలోకి దిగి బాక్సాఫీస్‌ను దున్నుకుందామని అనుకున్నాడు నేచురల్ స్టార్ నాని. కానీ అనుకోకుండా ‘సాహో’ ఆ వీకెండ్లోకి షిఫ్ట్ అయిపోవడంతో ‘గ్యాంగ్ లీడర్’ టీం డేట్ మార్చుకోక తప్పట్లేదు. ఇంకా కొత్త డేట్ అనౌన్స్ చేయలేదు. సెప్టెంబరు 13న రిలీజ్ చేస్తే ఎలా ఉంటుందా అని చూస్తున్నారు. కానీ ఈలోపే వరుణ్ తేజ్-హరీష్ శంకర్‌ల ‘వాల్మీకి’ సినిమా ఆ తేదీపై కర్చీఫ్ వేసేసింది.

ముందు ఈ చిత్రాన్ని సెప్టెంబరు 6న రిలీజ్ చేయాలనుకున్నారు. డేట్ కూడా ఇచ్చారు. కానీ ‘సాహో’ వచ్చిన వారానికే దీన్ని రిలీజ్ చేస్తే కలెక్షన్లపై ప్రభావం పడుతుందని వెనక్కి వెళ్లిపోయారు. ‘గ్యాంగ్ లీడర్’ టీం కంటే ముందే డేట్ ప్రకటించడం ద్వారా క్లాష్ ఎందుకనుకుంటే నాని సినిమానే వెనక్కి వెళ్తుందని భావించారో ఏమో మరి.

‘వాల్మీకి’ మీద హరీష్ శంకర్‌తో పాటు టీం అంతా చాలా ఆశలే పెట్టుకుంది. ఒక హిట్ ఇచ్చి పెద్ద ఛాన్స్ అందుకోవడం.. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేక బోల్తా కొట్టడం.. మళ్లీ మీడియం రేంజి సినిమా చేసి తనేంటో రుజువు చేసుకోవడం హరీష్ శంకర్‌కు ఆనవాయితీగా మారింది. చివరగా ఆయన తీసిన ‘దువ్వాడ జగన్నాథం’ గురించి చాలా బిల్డప్ ఇచ్చారు కానీ.. ఆ సినిమా చివరికి ఫ్లాపే అయింది. ఈ సినిమా తర్వాత ఏడాదికి పైగా ఖాళీగా ఉండిపోయాడు హరీష్. చివరికి తమిళ హిట్ ‘జిగర్ తండ’కు తనదైన టచ్ ఇస్తూ ‘వాల్మీకి’ తీశాడు.

తమిళంలో బాబీ సింహా చేసిన విలన్ పాత్రకు వరుణ్‌ను ఎంచుకోవడం.. ఆ పాత్రలో వరుణ్‌కు తనదైన మేకోవర్ ఇవ్వడం ఈ చిత్రంలో అతి పెద్ద విశేషం. ఇటీవలే రిలీజైన ప్రి లుక్ టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. త్వరలోనే టీజర్ లాంచ్ చేయబోతున్నారు. 14 రీల్స్ బేనర్ మీద రామ్ ఆచంట నిర్మిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే, అధర్వ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

No comments:

Post a Comment